కులాల రాజకీయములు
హిందు ధర్మ శాస్త్రములలో ఎక్కడా కూడా కులముల ప్రసక్తి లేదు. ప్రస్తుత సమాజములో మనబడే కులములు అన్నీ రాజకీయ కులములు అని గమనినిచాలి. శాస్త్రములలో వర్ణ ము గోత్రముల ప్రస్తకి మాత్రమే ఉంది.
వర్ణములు వృత్తిరీత్యా విభజించబడినవేనని విశ్లేషకులు చెబుతుంటారు. ప్రస్తుతము కులము అనే పదము ఒక ప్రాంతమునకు సంబందించిన సమాజిక వర్గమును సూచిస్తుంది. సంస్కృతం లో కులము అంటే ఇంటి కప్పు లేక అంతస్తు అని అర్ధము. అందుచేత ఒక కుటుంబము ను ఒక్కోసారి ఒక కులముగా వ్యవహరించ బడుతుండేది. అలాగే ఒక గ్రామము లో నివసించే వారినందరిని ఒకే కులం గా సంభోదించడము కూడా జరిగేది.
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
ప్రస్తుతము కులములు గా భావించబడుతున్న సామాజిక వర్గములు అన్ని కూడా జాతుల రీత్యా చూస్తే కల గూర గంపలే. ఒక కులములో వివిధ ఇంటిపేరుల వారు ఉంటారు. ఒకే ఇంటి పేరుతో వివిధ కులాల వారు ఉంటారు. ఒక ఇంటి పేరు వారు ఒక ప్రాంతములో ఒక వృత్తి ని అవలంభిస్తుంటే వేరే చేట వేరే వృత్తిలో ఉంటారు. ఒకే కులమనుకునే వారు కూడా ఇంటిపేరులను బట్టి ఒకరికొకరు వ్యతిరేకతను చూపించు కుంటూ, మాత్సర్యములు చెస్తుంటారు. ప్రస్తుతము సాధారణంగ ఇంటిపేరు ను బట్టే ఒకరి కులాన్ని మనము ప్రస్తుతం ఊహించుకుంటాము. ఇంటిపేరు నిర్ధానణ అయినతరువాత ఏ ప్రాంతము వాడా అని చూస్తాము.
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
అంటే ఇంటి పేరులు కులముల వ్యవహారములో ప్రధాన పాత్ర పోషిస్తున్నయి. ఇంటి పేరుల గురుంచి ఏ ధర్మ శాస్త్రములోను ఉటంకించిన సందర్భాలు లేవు. పూర్వం ఒకవ్యక్తిని సంభోదించే టప్పుడు ఫలానా వాని కొడుకు లేక మనుమడు లేక అల్లుడు అని వ్యవహరించేవారు. మత తంతులలో గోత్రము చెప్పేవారు. మరి ఇంటి పేరులు ఎలా ఉత్పన్నమయినవి ? ( తమిళ నాడులో తండ్రి పెరునే ఇంటి పేరుగా వ్రాస్తారు. ) ఇక ఎప్పటినుండి ఈ ఆధునిక కులములు మొదలయినవో చూద్దాం!
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
బ్రిటిషువారి టైములోని భారత ప్రభుత్వము 1881 నుండి జనాబా లెక్కల సేకరణ ప్రారంభించినది. తొలుత పట్టణాలలోను తరువాత మొత్తం బ్రిటిషువారి హయాములో ఉన్న ప్రాంతాలలోను ఈ జనాభా గణన 1941 వరకు పది సంవత్సరాలకొక సారి జరిగింది. ఈ ప్రక్రియలో కులమును కూడా నమోదు చెయ్యడము జరిగినది. అలాగే ఇంటి పేరు కూడా వ్రాయడము జరిగినది. మన దేశములో ఇంటిపేరు వ్రాసుకొనే సాంప్రదాయము పూర్వము లేదు. జనాభా లెక్కలతో నే ప్రారంభమయినది. అంటే ఇంటిపేరు ల వ్యవస్థకు ఒక వంద సంవత్సరాల వయస్సు మాత్రమే గలదు. ఇంటి పేరుల పై ఆధార పడిన కులముల పేర్ల కు కూడా అంతే వయసు కదా !
ఇంటి పేరు లు వ్రాసుకునే సాంప్రదాయము మనది కాదు. ఒకని ఊరి పేరు, లేక ఒకని పూర్వపు ఊరు పేరు అనగా పూర్వము అతను లేక అతని పూర్వికులు ఏ ప్రాంతము నుండు వలస వచ్చారు, లేక ఒకని వృత్తి, వాని పూర్వీకుల వృత్తి, లేక ప్రస్తుతము నివాసముంటున్న స్థలము పేరు ఇలా ఏదో ఒకటి ఇంటి పేరుగా జనాభా లెక్కల సేకరణ కాలములో వ్రాసేశారు. అంటే ఇంటి పేరులు అన్ని కృత్రిమమయినవేనని అర్ధము.
ఈ పేజీలు కూడా చదవండి
కులముల పేర్లు ఎంత మిధ్యనో ఇంకా కొన్ని విషయాలు గమనిస్తే తెలుస్తుంది. రాజు తో అంతెమయ్యే ఇంటిపేరులు బ్రహ్మణ కులములలో చాలా ఉంటాయి. అలానే రెడ్డి తో అంతమెయ్య ఇంటిపేరులు కాపు, కమ్మ, హరిజన కులాలలో చాల ఉంటాయి. అట్లాగే ఒక్కొక్కరు తమ కుమారులకు వారికులం కాని వేరే (అన్య) కులం పేరు పెట్టుకోవడం కూడా చూడవచ్చు.
కొంతమంది ఇంటిపేర్లలో వారు ఏప్రాంతమునుండి వలస వచ్చారో తెలిసిపోతుంది. ఒకే ఇంటి పేరులు చాలా కులాలలో ఉంటాయి. ఉదాహరణకు వడ్డి ఇంటిపేరు. వడ్డి అనగా ఒడిసా అని మనకు తెలుసు. ఇప్పుడు వడ్డి ఇంటిపేరు గల వారు అందరు తెలుగు నే మాట్లాడతారు. కాని వీరి పూర్వీకులు ఒరిస్సా నుండి వచ్చినవారు. వీరు అన్ని కులాలలోను ఉన్నారు.
పై చర్చను బట్తి మనము తెలుసుకోవలసినదే ఏమిటంటే కుల వ్యవస్థ వేరు, వర్ణ వ్యవస్థ వేరు. ఇంటి పేర్ల వల్ల కుల వ్యవస్థ పుట్టినది. కుల వ్యవస్థకు శాస్త్ర సమ్మతి లేదు. జాతులపరంగా చూస్తే కులము లన్ని కలగూర గంపలే.
ప్రస్తుతము మేము ఒక కులము అని భావిస్తున్న వారందరు తరతరాలుగా ఒకే కులము వారు అనేది ఒక మిధ్య. ఒక్కోసారి ఒక ఇంటి పేరు వారు ఒక కులమనుకుంటే వివిధ ఇంటి పేరుల వారి కలయిక ఒక కులంగా పరిణతి చెందిందని భావించవచ్చు. అలా కులములన్ని వేరు వేరు కులముల కలయికవల్ల ఉత్పన్న మయినపుడు ప్రస్తుతము కులాంతర వివాహములు జరగడమం ఒక సామాజిక చైతన్యమని భావించడము ఒక జోక్. కులాల వారీగా సమాజము ముక్కలయినదని పూర్తిగా నమ్మ నఖరలేదు. వర్ణ ము గోత్రము
రాజకీయపార్టీ ల విశ్లేషకులు కులాల వారీగా ఓట్లను లెఖ పెడుతుంటారు. వాస్తవానికి కులాలవారీగాను, మతపరంగాను ఓట్లు పడవు.
నాకు ఎలెక్షన్ల అనుభవము ఉంది. ఓటింగ్ కులాలవారీగా జరగడం చాలా అరుదు. ఒక కుటుంబములోని సభ్యులందరు ఒకే పార్టీ కు ఓటు వెయ్యరు. అలాగే భార్య ఒక పార్టీకి వేస్తే భర్త వేరే పార్టీకి వెయ్యవచ్చు. మరి ఎవరు నెగ్గుతారు ? అంటే నెగ్గే వారే అధిక మెజారిటీతో నెగ్గుతారు. అనగా ఎవరో తప్ప చాలామంది ఓటరులు తమ ఓటును వృధా చేసుకోవడానికి ఇష్టపడరు. అంచేత ఎలక్షను రోజుకు కొన్ని రోజుల ముందు నుంచి ఎవరు నెగ్గుతారో ఏపార్టీ నెగ్గుతుందే ఓటరులు అంచనా వేసుకుంటుంటారు. నెగ్గే వానికే ఓట్లు వేస్తారు. ఇక్కడ కులము ఫ్యాక్టర్ పనిచెయ్యదు.
ప్రస్తుతం రాజకీయ లబ్దికోసం కొంతమంది కులమనే సామజిక వ్యవస్థను వాడుకుంటున్నారు. ప్రజలకు ఎమోషనల్ గా (మానసిక ఉత్సాహం) తృప్తి పొందడానికి, ఒక్కోసారి ఆర్ధిక లబ్ది పొందడానికి కులం గుర్తు ఉపయోగ పడవచ్చు. కాని నాయకులకు కుల పిచ్చి ఉండదు. కులాభిమానమూ ఉండదు. ఏ నాయకుడు కూడా తమ స్వంత కులస్తులను నమ్మడు. ఎం టీ ఆర్ శ్రీనివాసులు రెడ్డి ని ముందు చేరదీశాడు. చివరికి అల్లుడి పై వాలాడు. ఇప్పుడు చంద్రబాబు తన కులములో ఎవ్వరిని కూడా దగ్గరికు చేరనివ్వడు. అవసరం వస్తే కొడుకునో బావమరిదినో సీఎం చెస్తాడు తప్ప తన కులములో వేరొకరిని సీ ఎం అవ్వనివ్వడు.
ఇందిరా గాంధి తన కొడుకులను చెరదీసింది గాని తన కులము వారిని కాదు
. చిరంజీవికి తన తమ్ముడు తప్ప తన కులస్తులలో ఎవరు నాయకులు కనిపించలేదా ? తానయినా, తన తమ్ముడయిన ఒకరు వ్రాసియిచ్చిన స్క్రిప్ట్ చదవడమే కదా?! తమ్ముడుతో తప్ప తన కులములో వేరే ఎవరితోనూ అన్యులు వ్రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదివించకూడదా?!
ఎవరయిన అంతే – కరుణానిధి, థాకరే, ములాయం ఎవరయినా సరే కులాన్ని కుల జనాన్ని వాడుకుంటారే తప్ప తమ తమ కులము లలోని వారి ప్రతిభను గుర్తించరు, పెంచరు.
రాజకీయ కుల సమీకరణలు నాయకులకు వారి కుటుంబాలకు భజన సమాజములు మాత్రమే. ఫలాన వాడు తమ వాడు అని అనుకోవడము వల్ల ఆ కులము వారికి మానసికానందము, సమాజములో ప్రతిపత్తి పెరుగుతాయి. అధికారము మాత్రము ఒక వ్యక్తి కుటుంబములోనే ఉంటుంది.
జనార్ధన ప్రసాద్.
ALSO READ MY ARTICLES ON
- Indian Constitution (Important Articles)
- Citizen’s Fundamental Rights
- Basic Structure of the Constitution
- Article 20
- Right to Life and Liberty
- Magna Carta
- England Bill of Rights
- American Bill of Rights
- French Bill of Rights