హిందీ భాష
హిందీ ప్రజలు గుజరాతీయుల ఆధిపత్యాన్ని నిరసిస్తున్నారేమోననే భయంతో బిజెపి ఇప్పుడు ఈ హిందీ భాష వివాదము ను లేవనెత్తుతున్నట్లు కనబడుతోంది. అలా వారిని మభ్యపెట్టి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించవచ్చని అనుకున్తున్దవచ్చు. దేశంలోని నిజమైన సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్ళించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. (हिंदी भाषा का विवाद)
See Article 343 on Official languages of India
ఒక దేశానికి ఒక భాష అనే నినాదం 100 సంవత్సరాల క్రితం యూరోపిప్ లోని వివిధ రాజ్యాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఉపయోగించారు. ఆ సమయంలో పాత రాజ్యాల విచ్ఛిన్నం తరువాత అచట ఇలా భాషా ప్రయుక్త దేశాలు ఏర్పడ్డాయి. కానీ భారతదేశం యూరప్‌కు భిన్నమయిన దేశం. జవహర్‌లాల్ మరియు ఆయన సహాయకులు భారతదేశాన్ని మతాతీతంగా భాషాతీతంగా సాంస్కృతికంగా ఒక ఐక్య దేశంగా ఏర్పరిచారు. 1953 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత అదే సూత్రాన్ని అవలంభించి 1956 లో భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
షా గారు హిందీయేతర భారతీయులందరిపై హిందీ రుద్దాలని అనుకుంటే, ఈ ప్రాజెక్టును ముందుగా గుజరాత్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాలలో ప్రయోగం చేసి తరువాత మిగతా రాష్ట్రాలలో చేస్తే మంచిది. అక్కడ ఆచరణలో వచ్చిన సమస్యలను అనుభవంగా తీసుకుని మిగతా చోట్ల తరువాత అమలు చెయ్యవచ్చు. కాని అక్కడ విజయవంతం చెయ్యగలరని నేను భావించను.
నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి
ఈ భాషా వివాదం వల్ల దేశానికి ఎంత అపకారం జరుగుతుందో వీరు ఆలోచిస్తున్నట్లు కనబడడం లేదు. భారత దేశం లోని హిందీయేతర ప్రజలందరూ అండమాన్ గిరిజనుల మాదిరిగా తమకు స్వంత భాష లేని వారుగా జీవించడం లేదు. భారతదేశంలోని ప్రతి భాషా జనులకు వారి వారి స్వంత సాంస్కృతిక వారసత్వం ఉంది. హిందీ భాషను పెంచి పోషించడం కోసం తమ గుర్తింపును పోగొట్టుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. భారతదేశంలో సుమారు 9 కోట్ల తెలుగు, 9 కోట్ల బెంగాలీలు ఉన్నారు.
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
7 కోట్ల ముప్పై లక్షల మరాఠాలు, 5 కోట్ల గుజరాతీయులు, 4 కోట్ల రాజస్థానీలు, 4 కోట్ల కన్నడిగలు, 7 కోట్ల తమిలులు భారతదేశంలో నివసిస్తున్నారు. ప్రతీ భాష కి కనీసం రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంటుంది.
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
భారతదేశంలో హిందీ భాష మాట్లాడే వారు అత్యధికులు అని చెప్పడం సరి అయినది కాదు. ఉత్తరప్రదేశ్ మొత్తం జనాభా 20 కోట్లు, బీహార్‌లో 10 కోట్లు, మధ్యప్రదేశ్‌లో 7.30 కోట్లు, హర్యానాలో 2.50 కోట్లు, రాజస్థాన్‌లో 6.80 కోట్లు. ఈ రాష్ట్రాలలో ఉన్న ప్రజలందరినీ హిందీ మాట్లాడేవారు అని చెప్పడం సరికాదు. వారంతా హిందీ మాట్లాడరు. వాస్తవానికి వీరిని హిందీ భాష ప్రజల క్రింద జమకట్టడం తప్పు. వారికి స్వంత ప్రాంతీయ భాష లు ఉన్నాయి. ఉదాహరణకు, అవధి భాషను 4 కోట్ల మంది, మైథిలిని 3.80 కోట్ల మంది, భోజ్‌పురిని 4 కోట్లు, మగధిని 1.40 కోట్లు, హర్యన్విని 2 కోట్ల మంది మాట్లాడుతారు. రాజస్థాన్‌లోని 6.80 కోట్ల జనాభాలో 5 కోట్ల మంది రాజస్థానీ భాష మాట్లాడుతారు.

వాస్తవానికి రాజ్యంగ రచనా సభ పెట్టిన ఓటింగ్ లో హిందీ ఒక్క ఓటు మెజారిటి తో అధికార భాష స్థానాన్ని సంపాదించింది. హిందీతో పోటిపడిన భాష తెలుగు కాదు, బంగాలీ కాదు. అది హిందుస్తానీ. భారతదేశంలో ఇప్పుడు 22 జాతీయ భాషలు ఉన్నాయి. హిందీ అధికారిక భాష. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం లో వారి వారి అధికారిక భాషలు ఉన్నాయి. ఉదాహరణకు, బెంగాలీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లో అధికారిక భాష. పంజాబీ పంజాబ్ రాష్ట్రం యొక్క అధికారిక భాష.
స్విట్జర్లాండ్ యొక్క ఉదాహరణను మనం అనుసరించగలిగితే ఈ భాషా సమస్య త్వరితంగా పరిష్కరించబడుతుంది అని నా అభిప్రాయం. మొత్తం 22 జాతీయ భాషలను భారతదేశ అధికారిక భాషలగా ప్రకటించెయ్యవచ్చు. మనము కంప్యూటర్ యుగంలో జీవిస్తున్నాము. కంప్యూటర్లను ఉపయోగించి ఎక్కువ అధికారిక భాషల పాలన వ్యవస్థ లోనికి సులభంగా మారిపోవచ్చు.
మరియు తెలుగు భాష భారతదేశంలో అత్యధిక జనాభా మాట్లాడే భాష. తెలుగు భాష 90 మిలియన్ల మంది మాట్లాడుతారు. తెలుగును ఎక్కువగా ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలతో పాటు దక్షిణాపథంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు మరియు మాట్లాడతారు. బీహార్, బెంగాల్ ప్రాంతాలు కూడా తెలుగును బాగా అర్థం చేసుకుంటాయి. హిందీని దక్షినాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. దక్షిణాదిలో తెలుగు అత్యంత ప్రియమయిన భాష. తెలుగుని అధికార భాష చేస్తే ఒకే భాష ఒకే దేశం సమస్య కూడా తీరుతుంది.
నా ఈ పేజీలు కూడా చదవండి
- మహాత్మా గాంధీ 1869-1915
- జవహర్‌లాల్ నెహ్రూ 1889-1940
- డా. సర్వేపల్లి రాధాకృష్ణన్
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య
మరియు హిందీకి దాని స్వంత లిపి లేదు. హిందీ దేవనాగరి లిపిని అవలంబిస్తుంది. తెలుగు లిపి ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన లిపిగా పేరుపొందింది. కాబట్టి హిందీ భాషకు తెలుగు లిపిని స్వీకరించడానికి హిందీ భాషావాదులు అంగీకరిస్తే బాగుంటుంది.
భాష ప్రజల సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. భారతదేశం బహుభాషా మరియు బహుళ-మత గుణములు కలిగిన ఒక విశ్వ విఖ్యాతమయిన దేశం. భారతదేశం 70 సంవత్సరాలకు పైగా ఒక దేశంగా మనుగడ సాగించింది, ఎందుకంటే దాని రాజ్యాంగం ఏ భాషా లేదా మతపరమైన మౌడ్యాలకు బానిస కాదు కాబట్టి. అంతటి పటిష్టమయిన రాజ్యాంగాన్ని ప్రసాదించిన జవహర్‌లాల్ గారు మరియు ఆయన సహాయకులకు ధన్యవాదాలు. భారతదేశం ఇలాగే వర్ధిల్లాలని కోరుకుందాం.
ALSO READ MY ARTICLES ON
- Indian Constitution (Important Articles)
- Citizen’s Fundamental Rights
- Basic Structure of the Constitution
- Article 20
- Right to Life and Liberty
- Magna Carta
- England Bill of Rights
- American Bill of Rights
- French Bill of Rights