అణు పరీక్షలు
అణు పరీక్షలు అణు ఒప్పందం: 1998 లో ఇండియా అణు పరీక్షలు జరిపిన దరిమిలా అమెరికా ఇండియా పై అణు ఒప్పందాన్ని రుద్దినది అని నా అభిప్రాయం. తొలుత అణుపరీక్షలు జరిపినపుడు కలిగిన సంతోషము అణు ఒప్పందము తరువాత తొలగి పోయింది.
ఇండియా అణు పాటవ పరీక్షలు జరపడం భారతీయుల యొక్క నైతిక హక్కు. అణుపరీక్షలు అణు బాంబులు తయారీకే కాకుండా అణు విద్యుత్తు ప్రాజెక్టులకు కూడా ఎంతో ఉపయోగకరం. చైనా దేశం కూడా భారతీయుల చర్యను మెచ్చుకోవడం విశేషం. అమెరికా గూడచార ఉపగ్రహాల కంట పడకుండా అణుబాంబు సామాగ్రిని ఫోక్రాను చేరవేయడం ఒక విధంగా ఆశియా దేశాలకు విజయంగా చైనా అభివర్నించింది . ఈ విషయంలో ఒక అమెరికన్ ప్రభుత్వ అధికారి ఏమన్నాడంటే “భారత దేశీయులు పెంటియమ్ చిప్స్ తయారు చేసిన మేధావులు సుమా!”.
అమెరికా ఈ అణు పరీక్షల విషయంలో భారత దేశాన్ని అంతర్జాతీయ విఫణిలో ఏకాకిని చేస్తుందని భయపడనక్కరలేదు. ఎందుచేతనంటే, భారతదేశాన్ని ఎకాకిని చేస్తే భారత దేశానికి చేసే అమెరికా వస్తువుల ఎగుమతి ఆగిపోయి అమెరికాలో నిరుద్యోగం పెరుగుతుంది. అంచేత ఇండియా ఈ విషయం లొ భయపడనఖ్ఖరలేదు.
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
ఇండియా ప్రస్తుతం అణు బాంబులు కలిగి ఉండటం భారత దేశానికి మరింత రక్షణ చేకూరినట్లు భావించాలి.అమెరికా ఈ అణు పరీక్షల విషయంలో భారత దేశాన్ని అంతర్జాతీయ విఫణిలో ఏకాకిని చేస్తుందని భయపడనక్కరలేదు. ఎందుచేతనంటే, భారతదేశాన్ని ఎకాకిని చేస్తే అమెరికా వస్తువుల ఎగుమతి ఆగిపోయి అమెరికాలో నిరుద్యోగం పెరుగుతుంది. అంచేత ఇండియా ఈ విషయం లొ భయపడనఖరలేదు. ఇండియా ప్రస్తుతం అణు బాంబులు కలిగి ఉండటం దేశానికి మరింత రక్షణ చేకూరినట్లు భావించాలి.
నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
అణు ఒప్పందం
అణు ఒప్పందం: అమెరికా దేశ ఆదేశాలను సిరసా వహించే విదేశాంగ విధానం కేంద్ర ప్రభుత్వం పాటించడానికి ఉర్రూతలూగు తున్నట్లు విధితమవుతుంది. (ఈ విశేషాంశం గురుంచి ముఖ్యమయిన తెలుగు, ఇంగ్లీషు వార్తా పత్రికులకు, తెలుగు, ఇంగ్లీషు, హింది టి.వి చానళ్ళకు ది 21.09.07 తేదీన పంపించడమయినది.) ఈ విధానం వల్ల దేశానికి ఏ దుస్థితి వస్థుందొ హెన్రి కిస్సింజర్ అనే పూర్వపు అమెరిక విదేశాంగ శాఖ మంత్రి మాటల్లో చూద్దాం, ఆయన ఏమని చెబుతాడంటె ” అమెరిక దేశం తొ ఏ దేశ మయితే స్నేహం చేస్థుందో ఆ దేశాన్ని అమెరికా సైనికంగ ఆక్రమిస్థుంది”. ఈయన చెప్పిన మాటలు ఎల్లప్పుడు అన్ని దేశాల విషయాలలో నిజమవుతుందని చరిత్ర చెబుతుంది.
అమెరికా తో చేతులు కలిపితే ఏమవుతుందో తెలిసి కూడ ప్రభుత్వం పార్లమెంటును త్రోసిరాజని ఎలా ముందుకు వెళ్ళగలుగుతుంది? ప్రభుత్వానికి ఇంతటి నిరంకుశ అధికారాలు రాజ్యాంగ పరంగ ఎలా దఖలు పడ్డాయో పరిశీలిద్దాం.
భారత దేశం ఒక గణ తంత్ర, ప్రజాస్వామ్య రాజ్యంగ 1950 లొ ఏర్పడింది.
భారత రాజ్యాంగ నిర్మాతల్లో ప్రధాన భూమిక పోషించిన జవహర్ లాల్ నెహ్రు గారు మన ప్రజాస్వామ్య వ్యవస్థ గురుంచి ఏమన్నరంటె , ” మన ప్రజాస్వామ్యం బ్రిటిషు వారి వెస్ట్ మినిస్టర్ వ్యవస్థను పోలి ఉంటుంది”. అంటే, కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రి పార్లమెంటుకు జవాబుదారి గ ఉండాలి.
(వాస్థవానికి జవహర్ లాల్ మరియు ఇందిర గాంధి ల హయాంలలో వారు కూడ పార్లమెంటును ప్రక్కకు పెట్టి విదేశీ , దేశ రక్షణ వ్యవహారాలు నడిపి ఉండి ఉండవచ్చు. కాని వారితో ఇప్పటి రాజకీయ నాయకులను పోల్చలేము కదా!
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
నెహ్రు, ఇందిరల దేశ భక్తి ఎప్పటికి తప్పు పట్ట లేనిది. అందుచేత వారి నిర్ణయాలు అప్పట్లో వివాదం కాలేదు కూడ. అప్పటి అంతర్జాతీయ పరిస్థుతులు, బల సమీకరణలు వేరు. అప్పట్లో రష్యా మనకు అండగ ఉండేది.ఉదాహరణకు యు ఎన్ లో ఇంగ్లీషు వారు కాశ్మీరు పై ప్రవేశ పెట్టిన ప్రతి తీరమానాన్ని రష్య వీటో చేస్తు వచ్చేది).
(ఇప్పటి పరిస్థుతులు వేరు. రష్య దేశం ఆర్ధికంగా కుదేలయి ఉంది. చైనా మనకు వ్యతిరేకమయి మన శత్రువులతో కుమ్మక్కై ఉంది. ఇప్పుడు భారత దేశం నిజంగా ఏకాకిగా ఉంది. అందుచేత విదేశీ వ్యవహారాల్లో న్యూ ఢిల్లీ ఆచి తూచి అడుగు వెయ్యాల్సిన అవసరం ఉంది).
పార్లమెంటరీ ప్రజాస్వామ్యమంటే ఎలా ఉంటుందో ఒక సారి గతంలోకి వెళితే అర్ధమవుతుంది.
1937 లో ఢిల్లీ లో ఎన్నికల ద్వార కేంద్ర చట్ట సభ ఏర్పడింది. 1939 లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలయింది. ఊహించిన విధంగానే బ్రిటిషు ప్రభుత్వం యుద్ధంలోకి భారత దేశాన్ని లాగింది.
అప్పుడు కేంద్ర చట్ట సభ సభ్యులు తమ తమ చట్ట సభ సభ్యత్వాలకు రాజినామాలు సమర్పించారు. కాంగ్రెసు యుద్ధానికి వ్యతిరేకం కాదు. బ్రిటిషు వారి ఆధీనంలో ఉన్న అప్పటి భారత దేశ ప్రభుత్వం కేంద్ర చట్ట సభను సంప్రదించకుండ జర్మనీ పై యుద్ధం ప్రకటించడం అంటె చట్ట సభలకు ప్రభుత్వ ద్రుష్టి లో విలువ లేదని ప్రభుత్వానికి ప్రజాస్వామ్య వ్యవస్థను భారత దేశంలో స్థాపించడం విషయం లో చిత్తసుద్ధి లేదని దానికి నిరసనగా వారు రాజినామాలు సమర్పించారు.
నా ఈ పేజీలు కూడా చదవండి
- మహాత్మా గాంధీ 1869-1915
- జవహర్లాల్ నెహ్రూ 1889-1940
- డా. సర్వేపల్లి రాధాకృష్ణన్
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య
1919 లో భారత దేశం లో పరిమిత ప్రజాస్వామ్యం కోసం కొంత ప్రయత్నం జరిగింది. అప్పుడు అన్ని అధికారాలు ఇండియాలో గవర్నరు జనరల్ అనే ఇంగ్లీషు అధికారి చేతిలో ఉండేవి.
౧౯౧౯ సంవత్సరంలో ప్రవేశ పెట్టిన కేంద్ర చట్ట సభల అధికారాలను నిర్వచించే టపుడు చట్ట సభల పరిధి నుండి భారత దేశ రక్షణ , విదేశీ వ్యవహారాలు, మత వ్యవహారాలు, విమానయానం , నౌకా దళం – ఈ విషయాలన్ని చట్ట సభల అధికార పరిధి నుండి మినహాయించారు.తరువాత 1935 భారత ప్రభుత్వ చట్టం కూడ పై విషయాలను పార్లమెంటు పరిధినుండి మినహాయించింది. ఈ చట్టం 1939 లో కూడ అమలులో ఉంది.
అయినాసరే పైన చెప్పిన విధంగా అప్పటి కాంగ్రెసు సభ్యులు రాజనామాలు చేసి దేశానికి ఎలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థ మున్ముందు ఉండబోతుందో దేశ ప్రజలకు రుచి చూపించారు అనిమనం గమనించాలి.
మన పూర్వీకులు ఎంతటి ప్రసస్థమయిన ప్రజాస్వామిక విలువలు మనకు వారసత్వంగా ప్రసాదించారు! ఇప్పుడు మనం ఏమి చేస్థున్నాం ? పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం పాలు చేస్థూ ప్రభుత్వం నిరంకుశం గా వ్యవహరిస్థుంటే పార్లమెంటు సభ్యులు కళ్ళప్పగించి చూస్థున్నారు. పార్లమెంటుకు ప్రజలకు విధేయులయి ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు రాజకీయపార్టీ ల అధ్యక్షులకు విధేయులయి పదవులను కాపాడుకోవడమే జేవిత పరమావధిగా భావిస్థున్నారు.
ఇక్కడ మరో విషయం గమనించాలి. మన ప్రస్థుత రాజ్యాంగం ఆర్టికల్ ౧౩ ప్రకారం రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత పూర్వపు చట్టాలు ఏవయిన రాజ్యాంగ అధికరణాలకు వ్యతిరేకంగా ఉంటే అవి చేల్లవు. అనగా కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటును తలదన్ననే అధికారాలు ఏమి చెల్లవు. పార్లమెంటు లో మూడవ వంతు సభ్యులున్న పార్టి దేశ రక్షణ వ్యవహారంలో ఏకపక్ష నిర్ణయం తీసుకొని వ్యవహారం నడిపించడం దేశ రాజకీయ దుస్థితికి నిదర్శనంగా భావించవచ్చు.
ALSO READ MY ARTICLES ON
- Indian Constitution (Important Articles)
- Citizen’s Fundamental Rights
- Basic Structure of the Constitution
- Article 20
- Right to Life and Liberty
- Magna Carta
- England Bill of Rights
- American Bill of Rights
- French Bill of Rights